‘హోంగార్డు కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుంది’ | - | Sakshi
Sakshi News home page

‘హోంగార్డు కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుంది’

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

‘హోంగార్డు కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుంది’ 10న జైల్‌ భరో విజయవంతం చేయాలి

కామారెడ్డి అర్బన్‌: అంకితభావంతో సేవలు అందిస్తున్న హోంగార్డు కుటుంబాలకు కష్ట కాలంలో పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ రాజేశ్‌ చంద్ర అన్నారు. గతేడాది మృతి చెందిన హోంగార్డు శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను పోలీసుశాఖ ఆయన భార్య రేఖ బ్యాంకు ఖాతాకు జమ చేసింది. దీంతో రేఖ శుక్రవారం సాయంత్రం ఎస్పీని కలిసిన కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఎస్పీ రేఖకు ధైర్యం చెప్పారు.

కామారెడ్డి టౌన్‌ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న చేపడుతున్న జైల్‌ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాటాడారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు, నాయకులు వెంకటి, దశరథ్‌, రాజనర్సు, నర్సింగరావు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement