గడువు సమీపిస్తోంది సర్‌! | - | Sakshi
Sakshi News home page

గడువు సమీపిస్తోంది సర్‌!

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

గడువు సమీపిస్తోంది సర్‌!

సర్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయిన బూత్‌ల వివరాలు..

జిల్లాలో ఎన్యుమరేషన్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలు..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు సంబంధించి ఓటర్లు అందుకున్న ఎన్యుమరేషన్‌ ఫారాలు(ఈఎఫ్‌) పూరించి బీఎల్‌వోలకు అందజేయడానికి గడువు ఆరు రోజులే మిగిలి ఉంది. ఈ నెలాఖరులోపు పత్రాలను బీఎల్‌వోలకు అందజేస్తే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఆలస్యమైతే డిజిటలైజ్‌ చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో అధికారులు ఈ నెలాఖరులోగా ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని సూచిస్తున్నారు. ‘సర్‌’ ప్రారంభమైన నాటి నుంచి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వేగంగా ప్రక్రియ సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌వో)లు మరింత వేగంగా పనిచేస్తున్నారు.

కాస్త వెనకబడిన కామారెడ్డి

జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో మూడు నియోజకవ ర్గాలున్నాయి. ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలో ఎన్యుమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ 88 శాతాని కిపైగా పూర్తవ్వగా... కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం 80 శాతమే పూర్తయ్యింది. పట్టణ ఓటర్లు పలువురు సొంత గ్రామాల్లో సర్‌ ప్రక్రియలో పాల్గొనడంతో లక్ష్యానికి కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నూరు శాతం లక్ష్యం దిశగా..

జిల్లాలో ఓటర్లకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ వంద శాతం లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 85.54 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు తెలిపారు. ఇంకా 14.46 శాతం జరగాల్సి ఉంది. జిల్లాలో 4 వందల బూత్‌లలో నూరు శాతం డిజిటలైజ్‌ చేశామని అధికారులు చెబుతున్నారు. ఇంకో వారం రోజలు సమయం ఉండడంతో మిగిలిపోయిన వాటిపై దృష్టి సారించారు. బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్యుమరేషన్‌ ఫారాలను సేకరించి, వాటిని వెంటవెంటనే డిజిటలైజ్‌ చేస్తున్నారు. కాగా ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్వోలకు ఇచ్చే గడువు సమీపిస్తుండడంతో పలువురు ఓటర్లు అయోమయంలో ఉన్నారు. ఓటరు జాబితా ఫారాలు నింపి ఇచ్చిన వారు ఊపిరి పీల్చుకుంటుండగా ఇంత వరకూ ఫారాలు నింపని వారు ఆందోళన చెందుతున్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గం

గాంధారి 25

లింగంపేట 17

నాగిరెడ్డిపేట 11

రాజంపేట 13

రామారెడ్డి 19

సదాశివనగర్‌ 26

తాడ్వాయి 24

ఎల్లారెడ్డి 33

మొత్తం 168

కామారెడ్డి నియోజకవర్గం

భిక్కనూరు 30

బీబీపేట 13

దోమకొండ 12

కామారెడ్డి 21

మాచారెడ్డి 13

పాల్వంచ 20

రాజంపేట 03

రామారెడ్డి 12

మొత్తం 124

జుక్కల్‌ నియోజకవర్గం

బిచ్కుంద 21

డోంగ్లీ 12

జుక్కల్‌ 14

మద్నూర్‌ 11

మహ్మద్‌నగర్‌ 06

నిజాంసాగర్‌ 12

పెద్దకొడప్‌గల్‌ 13

పిట్లం 19

మొత్తం 108

నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌లు మొత్తం ఓటర్లు ఈఎఫ్‌ పత్రాల డిజిటలైజేషన్‌ శాతం

పంపిణీ శాతం

జుక్కల్‌ 255 2,06,343 100 1,82,566 88.49

ఎల్లారెడ్డి 274 2,28,503 100 2,03,318 88.98

కామారెడ్డి 267 2,61,160 100 2,09,482 80.21

మొత్తం 796 6,96,006 100 5,95,366 85.54

ఫారాలు తిరిగివ్వడానికి

మిగిలింది ఆరు రోజులే

ఇప్పటి వరకు 4 వందల బూత్‌లలో

వంద శాతం పూర్తి

లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికార

యంత్రాంగం ప్రయత్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement