కామారెడ్డి టౌన్ : జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్)గా, అలాగే బాన్సువాడ ఏరియా ఆస్పత్రి, ఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.
బాన్సువాడ రూరల్: ఎరువుల లైసెన్సు గడువు ముగిసిన డీలర్లు వెంటనే వాటిని పునరుద్ధరించుకోవాలని ఐఎఫ్‌ఎఫ్‌సీవో జిల్లా మార్కెటింగ్ మేనేజర్ నరేష్ సూచించారు. శుక్రవారం దేశాయిపేట్ రైతువేదికలో బాన్సువాడ డివిజన్‌లోని ఎరువుల డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిజికల్ స్టాక్, ఈ–పాస్‌లో నమోదైన స్టాక్ మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సబ్సిడీ ఎరువుల కోసం సమగ్ర ఫర్టిలైజర్ యాప్‌ను ప్రారంభించనుందన్నారు. ప్రస్తుతం యూరియాకు మాత్రమే ఉన్న యాప్ త్వరలో అన్ని సబ్సిడీ ఎరువులకు వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ, నస్రుల్లాబాద్ మండల వ్యవసాయాధికారులు ఫయాజుల్లా, భవాని, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి రూరల్: మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ముకుంద్‌రెడ్డి కోరారు. రాఘవపూర్‌లో శుక్రవారం 4 వేల ఈతమొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వినీల, కామారెడ్డి ఏపీవో అన్నపూర్ణ, ట్రైనింగ్ ఏఈఎస్ అరుణ్ చంద్ర, ఎకై ్సజ్ సీఐలు సంపత్ కృష్ణ, సుందల్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాస్, రచన, పంచాయతీ కార్యదర్శి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం బస్వాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులు, బెదిరింపులకు పాల్పడినా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
నాగిరెడ్డిపేట: బ్యాంకులింకేజీ, సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ డీఆర్‌డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. గోపాల్‌పేట, లింగంపల్లి కలాన్, మాసాన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం బకాయి రుణాల వసూళ్ల కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఆమె పాల్గొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించి ఆదర్శ మండలంగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గౌరవ్ షిండే, ఇన్‌చార్జి ఏపీఎం దత్తయ్య, సీ్త్రనిధి అసిస్టెంట్ మేనేజర్ అమల, సీసీలు నజీర్, సాయిలు, సావిత్రి, గ్రామ సంఘాల అధ్యక్షులు పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


