● పోచారం గ్రామస్తుల్లో ఆనందం
పెద్దకొడప్‌గల్: మండలంలోని పోచారం గ్రామానికి శుక్రవారం ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభమైంది. దశాబ్దాల కల నెరవేరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి బస్సు సర్వీస్ లేకపోవడంతో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో అభినవ్ చందర్‌ల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు బాన్సువాడ డిపో మేనేజర్‌తో మాట్లాడారు. దీంతో స్పందించిన డీఎం.. పెద్దకొడప్‌గల్ నుంచి పోచారం గ్రామానికి బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. బస్ సర్వీస్ ప్రారంభంలో సర్పంచ్ బాలాజీ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శామప్ప పటేల్, నాయకులు మహేందర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.


