కామారెడ్డి క్రైం: విద్యార్థులకు యూనిఫాంల తయారీ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫాం అందించాలన్నారు. ఆగస్టు 30 లోపు రెండు జతలు ఇవ్వాలని సూచించారు. డీఈవో మల్లిఖార్జున్, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


