యాంత్రీకరణకు జై కొట్టి..
ఆర్మూర్:వర్షాకాలం వచ్చిందంటే గతంలో జిల్లా లోని పొలాల్లో ఎడ్లు, నాగళ్లతో పల్లెలు సందడి గా మారేవి. ఆ పచ్చదనంలో ఎడ్లతోపాటు రైతు కష్టం కూడా కనిపించేది. ఇప్పుడు ఆ దృశ్యం క నుమరుగవుతోంది. సంప్రదాయ వ్యవసాయా న్ని పక్కన బెట్టి యాంత్రీకరణవైపు రైతులు మొ గ్గు చూపుతుండటంతో ఎడ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చి చేరాయి. వ్యవసాయ విధానంలో మార్పు రావడం మంచిదే. కానీ సంప్రదాయం, మాన వ, జంతు అనుబంధం కూడా ఎక్కడో ఒకచోట బతికి ఉండాలి. లేకపోతే వచ్చే తరానికి ‘ఎడ్లతో దున్నడం‘ అంటే పుస్తకంలో ఫొటోలా మిగిలిపోతుంది. నాటి కాలం వృద్ధ రైతులు పశువులతో రైతులకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంటే నేటి తరం యువ రైతులు మాత్రం యాంత్రీకరణకే పెద్దపీటవేస్తున్నారు.
ప్రస్తుతం ట్రాక్టర్ కేజ్‌వీల్స్‌తో వేగంగా
పొలం దున్నుతున్న రైతు
ఆర్మూర్ శివారులో ఎడ్ల నాగలితో
పొలం దున్నుతున్న రైతు (ఫైల్)


