కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపురసుందరి ఆలయంలో ఈనెల 15న ప్రారంభమైన వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు లాటరీ ద్వారా 11 మందికి అమ్మవారి చీరలు, ఇతర భక్తులకు కనుములను అందజేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సిద్ధారెడ్డి, దామోదర్, శ్రీనివాస్, అర్చకులు ప్రదీప్, వినోద్‌కుమార్ శర్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: సింగూరు ప్రాజెక్టులో నీటిసామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ఉండటానికి జీపీ బోరు బావుల వద్ద ఉపాధి హామీ నిధులతో ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నట్లు ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. గురువారం మండలంలోని సోమేశ్వర్, పోచారం జీపీ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం కోసం మార్కవుట్ ఇచ్చామన్నారు. మండల పంచాయతీ అధికారి మహిబూబ్, టెక్నికల్ అసిస్టెంట్ గోపి, జీపీ కార్యదర్శులు రవి, యోగేశ్వర్, క్షేత్రసహాయకుడు బీమరాము తదితరులు ఉన్నారు.


