అనువైన పంటలను సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అనువైన పంటలను సాగు చేయాలి

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

కమ్మర్‌పల్లి(మోర్తాడ్‌): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తు వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి రైతులకు సూచించారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన పంటల వైవిధ్యీకరణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ నీటి తడులు అవసరమయ్యే కంది, సజ్జ, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ పంటలు తక్కువ వర్షపాత పరిస్థితుల్లో కూడా మెరుగైన దిగుబడిని అందించే అవకాశం ఉండటంతోపాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, వ్యవసాయ శాఖ సూచనలను అనుసరించి పంటలను ఎంపిక చేసుకోవాలని, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని కోరారు. జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్‌, ఏవో హరీశ్‌, మండల హర్టికల్చర్‌ ఆఫీసర్‌ రాజాగౌడ్‌, ఏఈవోలు శ్రీలత, లకపతి, మహేశ్‌ భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement