టీచర్లు సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

టీచర్లు సమయపాలన పాటించాలి

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

టీచర్లు సమయపాలన పాటించాలి

మోపాల్‌: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, బడుల్లో సెల్‌ఫోన్లను వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా ఎస్‌జీటీలకు కొనసాగుతున్న శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టాలని, వారి హాజరుశాతం పెరిగేలా చూడాలని తెలిపారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందేలా చూడాల్సిన బాధ్యత హెచ్‌ఎంలదేనని స్పష్టంచేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ఎంఈవో సాయిలు, రిసోర్స్‌పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement