భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని హైవే వద్ద గల టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందినట్లు భిక్కనూరు ఎస్సై అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తండాకు చెందిన శివకుమార్(32) అనే వ్యక్తి బైక్‌పై తన వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అతడు గురువారం రాత్రి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా టోల్‌ప్లాజా సమీపంలో బైక్ అదుపు తప్పడంతో కిందపడి మృతి చెందాడు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.


