‘ఎమ్మార్పీఎస్‌ ఉద్యమ బాధ్యత తీరిపోలేదు’ | - | Sakshi
Sakshi News home page

‘ఎమ్మార్పీఎస్‌ ఉద్యమ బాధ్యత తీరిపోలేదు’

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

‘ఎమ్మార్పీఎస్‌ ఉద్యమ బాధ్యత తీరిపోలేదు’ ఎల్లారెడ్డి ఏటీసీ పరిశీలన నూతన కార్యవర్గం ఎన్నిక ఈద్గా ప్రహరీ పనులు ప్రారంభం

కామారెడ్డి అర్బన్‌: ఎస్సీ వర్గీకరణతో ఎమ్మార్పీఎస్‌ ఉద్యమ బాధ్యత తీరిపోలేదని, సమాజంలో అణగారిన ఎస్సీ, ఎస్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉద్యమాలు చేయాల్సి ఉందని జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్‌ అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా సామ్యెల్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీస్‌ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. నాయకులు పద్మారావు, వెంకటరాములు, గంగారాం, శ్రీకాంత్‌, లక్ష్మి, లావణ్య, కాశీరాం, అరుణ్‌, పెద్ద కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ను మున్సిపల్‌ చైర్మెన్‌ పద్మ శ్రీకాంత్‌ గురువారం పరిశీలించారు. కళాశాలలో ఉన్న ట్రేడ్స్‌, విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్‌ రోపానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి కళాశాలకు సరిపడా సిబ్బంది పోస్టులు సాంక్షన్‌ చేసేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని చైర్మన్‌ అన్నారు. సొసైటీ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌, కౌన్సిలర్లు తిరుపతి, గఫార్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌, కాంగ్రెస్‌ నాయకులు వెంకటేశం, రఫీక్‌, రాములు తదితరులు ఉన్నారు.

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అబ్బగోని మహేశ్‌గౌడ్‌, ఉపాధ్యక్షులుగా అడప శ్యామ్‌ల, ఎం సీతారామ్‌, ప్రధాన కార్యదర్శిగా ఆకుల శ్యామ్‌ కుమార్‌, కార్యదర్శిగా చిందం మల్లేశ్‌, కోశాధికారిగా రాసమొల్ల రవి ఎన్నికయ్యారు.

పిట్లం: మండల కేంద్రంలోని మైనారిటీ ఈద్గా వద్ద కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులను సర్పంచ్‌ కుమ్మరి చంద్రశేఖర్‌ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ అవైజ్‌ బేగ్‌, మజీద్‌ కమిటీ సదర్‌ యదుల్‌, బసీద్‌, నవీన్‌, జుక్కల్‌ నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు ఇమ్రోజ్‌, ఇమ్రాన్‌, జియా, అద్నాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement