తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ వన్‌టైం చాన్స్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ వన్‌టైం చాన్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 60 మంది విద్యార్థులకు గానూ 57 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 94 మంది విద్యార్థులకు గానూ 91 మంది హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 66 మంది విద్యార్థులకు గానూ 4గురు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 14 మంది విద్యార్థులకు గానూ ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ) 4, 5వ సెమిస్టర్లు, ఏపీఈ, ఐపీసీహెచ్ 7, 9వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు ఆరుగురు విద్యార్థులకు గానూ ఇద్దరు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 24 మంది విద్యార్థులకు గానూ ఒకరు గైర్హాజరైనట్లు తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బీపెడ్ 1, 2, 3, 4వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలకు గురువారం 16 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 52 మంది విద్యార్థులకు గానూ 36 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు ఇద్దరు విద్యార్థులకు గానూ ఇద్దరు హాజరైనట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న బీఈడీ, బీపెడ్ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరుగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి సంఘాలు తలపెట్టిన తెలంగాణ విద్యాసంస్థల బంద్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు వివరించారు. శనివారం నుంచి జరగాల్సిన తదుపరి పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. వాయిదా పడిన పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు.
క్యాంపస్ కబుర్లు


