ఉప్పల్‌వాయిలో ఒకరి ఆత్మహత్య
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని ఉప్పల్‌వాయి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన తాటికొండ గణేష్ (37) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య అపర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ గురువారం ఉదయం తన తల్లి బుచ్చవ్వ, భార్య అపర్ణలతో ఉన్న భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. వారు డబ్బులు లేవనడంతో గణేష్ తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. ఈక్రమంలో అతడు ఇంట్లోకి వెళ్లి లోపల గడియపెట్టుకొని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెర్కిట్‌లో మరొకరు..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినటున్ల ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ తెలిపారు. వివరాలు ఇలా.. పెర్కిట్‌కు చెందిన పెద్దకాపు రవీంధర్‌రెడ్డి(45) అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందాడు. గత శుక్రవారం ఆస్పతి నుంచి ఇంటికి రాగా.. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేనిసమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
నిజాంసాగర్ (జుక్కల్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఈ నెల 18న ఎదురుగా వస్తున్న బైక్‌ను పెద్దగొల్ల సందీప్ (22) అనే యువకుడు పల్సర్ బైక్ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో సందీప్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం మొదట అతడిని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్య కోసం అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. గురువారం పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో బైక్‌పై నుంచి పడి గాయపడిన తండ్రి, కూతురు నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


