తాడ్వాయి: గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్ మైలాం రవీందర్‌రెడ్డిని బైండోవర్ చేయడం ఎంతవరకు సమంజసమని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జంగం మంగారెడ్డి అన్నారు. తాడ్వాయి మండలంలోని కన్‌కల్ సర్పంచ్ మైలాం రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మహేశ్‌ను ఎలాంటి విచారణ చేపట్టకుండా తహసీల్దార్ శ్వేత, ఎస్సై నరేశ్ కలిసి బైండోవర్ చేయడం సరైంది కాదన్నారు. మండల సర్పంచులు, నాయకులు పోలీసు స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలకు తరలివచ్చారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లను పోలీసులు బైండోవర్ చేయడం వల్ల సర్పంచుల హక్కులను కాలరాయడేమని ఆరోపించారు. బైండోవర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో భరత్‌కుమార్, ఎంపీవో సవితారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రావులకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్‌రెడ్డి, తాజొద్దీన్, చంద్రారెడ్డి, నర్సింలు, పోచయ్య, నాయకులు కపిల్‌రెడ్డి, రాజిరెడ్డి, సంజీవ్, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


