బాధితులకు భరోసా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు భరోసా కల్పించాలి

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

ఎస్పీ రాజేశ్‌ చంద్ర

తాడ్వాయి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విని చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ఎస్పీ గురువారం తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అధికారులకు ఇచ్చిన సూచనలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉందా లేదా అన్నది స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌, కోర్టు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై ఎస్‌హెచ్‌వోను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అలాగే పీఎస్‌లో కేసుల నమోదు విధానం, ఆన్‌లైన్‌ సీసీటీఎన్‌ఎస్‌ వ్యవస్థ పనితీరు, ఫిర్యాదులను స్వీకరించే విధానం, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. ప్రతి పిటిషనన్‌ను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, పాత నేరస్తులు, సస్పెక్ట్‌ వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గణేష్‌ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహక కమిటీలతో సమన్వయం, తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ సంతోష్‌ కుమార్‌, తాడ్వాయి ఎస్‌హెచ్‌వో నరేశ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement