ఎల్లారెడ్డి: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష, అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇప్పటివరకు 94 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో గ్రామాల్లో 100 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బీఎల్‌ఏలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సర్ ప్రక్రియ ఇన్‌చార్జి కోఆర్డినేటర్లు యాదయ్య, ధనలక్ష్మి, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


