ప్రతి ఒక్కరూ రెండు మొక్కలను నాటాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ రెండు మొక్కలను నాటాలి

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

రాజంపేట (భిక్కనూరు)/బీబీపేట: ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలను నాటాలని రాజంపేట ఎంపీడీవో సూర్యాజీ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గోని మొక్కలను నాటారు. బీబీపేట మండలం ఉప్పర్‌పల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్‌ పుట్ట మమత మల్లేష్‌లతో ఎంపీడీవో నరేశ్‌ కలిసి మొక్కలు నాటారు. జీపీ సిబ్బంది ఉన్నారు.

ఈత మొక్కలు నాటి సంరక్షించాలి

నస్రుల్లాబాద్‌/మాచారెడ్డి : ఈత మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత గీత కార్మికులు తీసుకోవాలని బాన్సువాడ ఎకై ్సజ్‌ సీఐ దిలీప్‌ అన్నారు. నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో బుధవారం ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రావు ఈత మొక్కలు నాటారు. సర్పంచ్‌లు ఉమా, విజయ, ఎకై ్సజ్‌ సిబ్బంది, స్థానిక నాయకులు, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్తులకు మొక్కల పంపిణీ

ఎల్లారెడ్డి/సదాశివనగర్‌ : ఎల్లారెడ్డి మండలం శివాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ పల్లె నాగరాజు గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అలా అయితేనే లక్ష్యం నెరవేరుతుందని సర్పంచ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం తుక్కోజివాడి గ్రామంలో ఇంటింట మొక్కలను సర్పంచ్‌ సంగారావు పంపిణీ చేశారు.

అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామీణ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను వెంటనే తయారు చేయాలని ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం పలుగ్రామాల పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణకు సంబంధించిన నిబంధనలను ఆయన వివరించారు. ఎంపీవో ప్రభాకర్‌చారి, ఏపీవో సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని సీతారం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఎంపీడీవో అభినవ్‌ చందర్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

బాన్సువాడ రూరల్‌: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్‌ లబ్ధిరులకు సూచించారు. బుధవారం ఆయన గృహనిర్మాణశాఖ ఏఈ వినీత్‌తో కలిసి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శి రాధికను ఆదేశించారు. సర్పంచ్‌ నాందేవ్‌, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిలు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement