మాచారెడ్డి: కొత్తగా విధుల్లో చేరిన మాచారెడ్డి ఎస్‌ఐ విజయ్ ని బుధవారం మండల ఆటో యూనియన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆటోవాలాలు స్వామి గౌడ్ దేవా గౌడ్, డి స్వామి గౌడ్, శర్మన్, దుజీరాం, మోహన్, ఎం. స్వామి గౌడ్, రవి, నాగరాజు, అంజయ్య ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సై విజయ్‌కి శాలువా కప్పి సన్మానం చేశారు. కాంగ్రెస్ నాయకులు అలీ ఖాన్, బన్సీ నాయక్, శ్రీధర్ రావు, సీతారాం, మాణిక్ సాయి, షాదుల్, నరేష్, బాబా ఖాన్ ఉన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఆరోగ్య రక్షణ, క్యాన్సర్ నివారణకు బుధవారం వ్యాక్సిన్ ఇచ్చినట్లు మండల వైద్యాధికారి హిమబిందు తెలిపారు. 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు బా లికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పించే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. హెచ్‌ఎం శోభారాణి, వైద్య సిబ్బంది శోభారాణి, భూలక్ష్మి, నౌషీన్, రజిని, తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన విద్యార్థుల
అభివృద్ధికి కృషి చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు కోర్సు డైరెక్టర్ మండల విద్యాధికారి అంజల్‌రెడ్డి సూచించారు. బుధవారం ఎఫ్‌ఎల్‌ఎన్ రెమిడియోషన్‌పై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు షౌకత్‌అలీ, రిసోర్స్ పర్సన్స్ మమిపాల్, చంద్రశేఖర్, రాములు, మాధురి, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


