సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

జిల్లా ఎకై ్సజ్‌ ఈఎస్‌ ముకుంద్‌రెడ్డి

సలాబత్‌పూర్‌ అంతర్రాష్ట్ర

ఎకై ్సజ్‌ చెక్‌పోస్ట్‌ తనిఖీ

మద్నూర్‌(జుక్కల్‌): మద్నూర్‌ మండలం మహారాష్ట్రకు సరిహద్దున ఉండటంతో మహారాష్ట్ర నుంచి వ చ్చే వాహనాలపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎక్సై

జ్‌ సూపరింటెండెంట్‌ ముకుంద్‌రెడ్డి ఆదేశించారు. మండలంలోని సలాబత్‌పూర్‌ వద్ద గల అంతర్రాష్ట్ర ఎకై ్సజ్‌ చెక్‌పోస్ట్‌ను బుధవారం ఆయన సందర్శించారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దులో నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి మత్తు, దేశిదారు మద్యం, అల్ఫాజోలం తదితర మత్తు పదార్థాలు మన రాష్ట్రంలోకి తరలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌పోస్ట్‌లో పని చేసే అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో సర్పంచ్‌ ఉషా సంతోష్‌తో కలిసి మొక్కలు నాటారు. ట్రైనీ ఏఈఎస్‌ అరుణ్‌చంద్ర, సలాబత్‌పూర్‌ ఎకై ్సజ్‌ సీఐ జావీద్‌ అలీ, పవన్‌గౌడ్‌, డీటీఎఫ్‌ సీఐ సుందల్‌సింగ్‌, ఎస్సై నాగేశ్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement