మద్నూర్(జుక్కల్): ప్రేమలు, మోసాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిర్మూలనపై మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం చేత కళజాత కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై మోహన్‌రెడ్డి, కళాబృందం ఇన్‌చార్జి రామంచ తిరుపతి, శేషరావు, సాయిలు, ఎంఈవో రాములు, ఐసీడీస్ సీడీపీవో కళావతి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు శారత, తులసి, విద్యార్థులు పాల్గొన్నారు.


