విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

లింగంపేట(ఎల్లారెడ్డి) : విధులు సక్రమంగా నిర్వ హించకుండా అజాగ్రత్తగా ఉంటే చర్యలు తప్పవని సిబ్బందిని డీఎఫ్‌వో నిరజ్‌కుమార్‌ సిబ్బందిని హె చ్చరించారు. లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రా మ శివారులో ఇటీవల నాటిన హరితవనాల మొక్కలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించా రు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని గిరిజను లు కబ్జా చేసుకుంటే ఏం చేశారని ప్రశ్నించారు. తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నెల 14న హరిత వనాలలో భాగంగా ఉపాధి హామీ కూలీలు, అధికారులు కలిసి 1000 మొక్కలు నాటారు. అందులో గుర్తు తెలియని వ్య క్తులు 350 మొక్కల వరకు ధ్వంసం చేశారు. ఈ వి షయమై గ్రామ సర్పంచ్‌, గ్రామ పంచాయతీ కా ర్యదర్శి, క్షేత్రసహయకుడు, కలిసి అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని ప రిశీలించడానికి వెళ్లగా వారిని ఆగపల్లి తండాకు చెందిన పలువురు గిరిజనులు దాడికి యత్నించి దూ షించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకొని హరిత వనాలకు రక్షణ కల్పించాలని లింగంపేట పోలీస్‌ స్టే షన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా తనకు స మాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారులను ప్ర శ్నించారు. పర్మళ్ల ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ శ్యామ్‌ సుందర్ను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు డీఎఫ్‌వో నిరజ్‌కుమార్‌ ప్రకటించారు. సెక్షన్‌ ఆఫీసర్‌ విక్కీ మార్టిన్‌ను సస్పెన్షన్‌ చేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ క న్సర్వెటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌కు సిఫారసు చేశారు. అలాగే అటవీ భూములను కబ్జాకు పాల్పడిన ఇద్దరు గిరిజ న వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండుకు త రలించాలని ఎఫ్‌ఆర్వోను ఆదేశించారు. అలాగే క్షే త్రసహయకుడు లక్ష్మణ్‌, గ్రామ పంచాయతీ పాలకులు తమకు రాతపూర్వకంగా జరిగిన సంఘటన ను నివేదిక ఇవ్వాలని సూచించారు. గిరిజనులు ధ్వంసం చేసిన మొక్కలతో పాటు దున్నిన భూమిని పరిశీలించారు. పూర్తి నివేదికను తనకు అందజేయా లని ఎఫ్‌ఆర్‌వోను ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌, ఫారెస్టు సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.

డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌

మొక్కలు ధ్వంసం చేసిన ప్రదేశం

పరిశీలన

పర్మళ్ల ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌

శ్యామ్‌ సుందర్‌పై సస్పెన్షన్‌ వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement