మండలంలోని ఇసన్నపల్లి – రామారెడ్డిని విభజించే రోడ్డు గుంతలయంగా మారింది. ఇసన్నపల్లి హనుమాన్ దేవాలయం నుంచి రాజమ్మ తండా, దొక్కల్ మీదుగా నిజామాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈరోడ్డు గుండా వెళ్తాయి. రోజు వందలాది మంది ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాల విద్యార్థులు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంటారు. ఇదే మార్గంలో ఉన్న సీసీ రోడ్డుకు గుంతలు పడటంతో మొరం పోసి వదిలేశారు. దీంతో సీసీ కాస్త మట్టి రోడ్డుగా మారింది. రోడ్డుపై గుంతలతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – రామారెడ్డి


