పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలోని హరిజనవాడ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 510లోని ప్రభుత్వ భూమిని రెవెన్యు అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ రాజశేఖర్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది ఆభూమిని పరిశీలించి, వెంటనే చదును పనులు చేపట్టారు.గత కొంతకాలంగా ఈ స్థలంపై ఆక్రమణలు జరగకుండా నిరోధించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టారు. మండల పరిధిలో సర్కారు స్థలాలను కాపాడేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు,ఆర్‌ఐ, సర్వేయర్ స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
రాజంపేట(భిక్కనూరు) : రాజంపేట నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులును కామారెడ్డి రాజంపేట ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు మంగళవారం సన్మానించారు. ఈ సందర్బంగా ఎస్సై ఆంజనేయులును శాలువాలతో మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి భూమేష్ గుప్త,రాజంపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ముత్యపు సిద్దరాములు, ప్రధానకార్యదర్శి, మోగిలిపల్లి రమేష్ గుప్త, కోషాధికారి బంధం పద్మరావు, ప్రతినిదులు కొండ సురేందర్ గుప్త, మొలుగు చంద్రమౌళి, బంధం మల్లేషం, ముత్యపు చక్రపాణి, తాటి రమేష్, మొలుగు శ్రీనివాస్‌ల, శివుడు, బందం అనిల్‌లు పాల్గొన్నారు.


