ప్రభుత్వ ఆస్పత్రి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రి

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

వైద్యాధికారులు దృష్టి సారిస్తేనే..

సిజేరియన్లతో ఎన్నో సమస్యలు..

జిల్లాలో ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాల వివరాలు..

ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వైద్యులు

85 శాతం సిజేరియన్లు నమోదు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం

సాధారణ కాన్పులే అధికం

ప్రసూతి కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే చాలు వెనకాముందు ఆలోచించడం లేదు.. సాధారణ కాన్పులకు అవకాశం ఉన్నా సిజేరియన్లు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఐదేళ్ల కాలంలో 87,331 కాన్పులు జరగ్గా.., ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70,828, ప్రైవేటులో 16,503 జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాభై శాతానికిపైగా సాధారణ కాన్పులు నమోదవుతుండగా.. ప్రైవేటులో ఇవి 15 శాతం మాత్రమే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70,828 కాన్పులకు గాను 37,390 సాధారణ, 33,438 సిజేరియన్లు జరిగాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో 16,503 డెలివరీలు జరిగితే అందులో 14,082 సిజేరియన్లే కావడం గమనార్హం. 2,421 సాధారణ కాన్పులే జరిగాయి.

కాసులకోసమేనా?

ప్రైవేటు ఆస్పత్రులు ధనదాహంతో విచ్చలవిడిగా సిజేరియన్‌ ఆపరేషన్లు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అవసరమైతేనే సిజేరియన్‌ చేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వాస్పత్రుల్లో యాౖభై శాతానికిపైగా సాధారణ కాన్పులు జరుగుతుండగా.. ప్రైవేటులో 15 శాతం మాత్రమే నార్మల్‌ డెలివరీ ఉండడం ఆరోపణలకు బలమిస్తోంది. సాధారణ ప్రసవం జరిగినపుడు అదే రోజు లేదా మరుసటి రోజు డిశ్చార్జీ చేస్తారు. సిజేరియన్‌ అయ్యిందంటే ఐదారు రోజుల వరకు ఆస్పత్రిలో ఉండాల్సిందే.. సాధారణ ప్రసవానికి రూ.15 వేల నుంచి 30 వేల వరకు ఫీజులు తీసుకుంటుండగా.. సిజేరియన్లకు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలను బట్టి చార్జీలు ఉంటున్నాయి.

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంక ట్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడేందుకు కృషి చేస్తున్నారు. ఆయన నిత్యం ఆస్పత్రులను చుట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలని, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వైద్యాధికారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న కోతలపైనా దృష్టి సారించాలని, సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మనీరు పూర్తిగా లేకపోవడం, గర్భిణీకి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి సందర్భాలలో బిడ్డను, తల్లిని కాపాడాలన్న ఉద్దేశంతో సిజేరియన్లు చేస్తుంటారు. అయితే కొన్ని ఆస్పత్రుల్లో అయితే నొప్పులొస్తున్నాయంటే చాలు అడ్మిట్‌ చేసుకుని సిజేరియన్‌ చేసేస్తున్నారు. సిజేరియన్లతో తల్లి బలహీనంగా మారడం, కనీసం నెల, రెండు నెలలు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు సిజేరియన్‌ అయిన వారికి కుట్లు సరిగా అతుక్కోకపోవడం, ఇన్‌ఫెక్షన్లు సోకడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రి

సంవత్సరం ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేట్‌ ఆస్పత్రులు

సాధారణం సిజేరియన్‌ మొత్తం సాధారణం సిజేరియన్‌ మొత్తం

2022–23 9,236 8,805 18,041 606 3,094 3,700

2023–24 10,445 6,109 16,554 511 3,228 3,739

2024–25 8,828 8,401 17,229 562 3,512 4,074

2025–26 7,139 8,302 15,441 605 3,312 3,917

2026–27(జూన్‌) 1,742 1,821 3,563 137 936 1,073

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement