కామారెడ్డి టౌన్ : జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ సెంటర్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్ పి.ముక్తిద మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు నమోదు చేసుకోవడంలో ప్రజలు, న్యాయవాదులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. కక్షిదారులు, పోలీసు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సూర సుమలత, బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, ప్రభుత్వ ప్లీడర్ శ్యామ్‌గోపాల్‌రావు, తహసీల్దార్ హిమబిందు, కోర్టు సీఏవో రాంచందర్, సూపరింటెండెంట్లు భుజంగరావు, వెంకట్‌రెడ్డి, చంద్రసేన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్)గా శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం డైరెక్టర్ ఆఫ్ సెంకడరీ హెల్త్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు డీసీహెచ్‌ఎస్‌గా విధు లు నిర్వహించిన విజయభాస్కర్ ఆర్మూర్ సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. జుక్కల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విజయరాజ్ నియమితులయ్యారు.
బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎం.శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన కామారెడ్డి ఆస్పత్రినుంచి డాక్టర్ల రేషనలైజేషన్‌లో భాగంగా బాన్సువాడకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయ్యారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బా లికల హాస్టళ్ల లో నెలకొన్న నీటి సమస్య ను పరిష్కరి స్తామని ము న్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. నీటి ఎద్దడిపై ఫిర్యాదు మేరకు ఆమె మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టళ్లను పరిశీలించారు. విద్యార్థినులతో మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వంటశా ల, గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో హాస్టళ్లలో నీటి సమస్య పరిష్కరించాలన్నారు. అనంత రం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వనిత, మిషన్ భగీరథ డీఈ హన్మంత్‌రావు, హాస్టల్ వార్డెన్ స్వప్న తదితరులున్నారు.
కామారెడ్డి టౌన్ : జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రోడ్డు భద్రతా చర్యలపై మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్ మార్కింగ్స్, క్రాష్ బ్యారియర్లు, స్ట్రీట్ లైటింగ్ వంటి అంశాలపై చర్చించారు. రహదారి ఇంజినీరింగ్ లోపాల సవరణ, అత్యవసర వైద్య స్పందన వ్యవస్థ బలోపేతంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఏఐ డీజీఎం ఆర్.శాలిని, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ వినోద్, డీటీవో సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


