రాష్ట్ర భట్రాజు మహిళా విభాగం
ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పద్మజ
కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం మహిళా కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జిల్లా కేంద్రానికి చెందిన పద్మజ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని భట్రాజు సంఘ భవనంలో 33 జిల్లాల మహిళా ఓటర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో, ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం జిల్లా భట్రాజు మహిళా కమిటీ అధ్యక్షురాలిగా సేవలుందిస్తున్న పద్మజను రాష్ట్ర స్థాయి పదవి రావడంతో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భట్రాజు సంఘం ప్రతినిధులు, సభ్యులు హర్షం వ్యక్తం చేసి, ఆమెను ఘనంగా సన్మానించారు.
23న కామారెడ్డిలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర
కామారెడ్డి అర్బన్: ఈనెల 23న దేవునిపల్లి భగత్‌సింగ్ విగ్రహం నుంచి సిరిసిల్ల రోడ్డులోని అయ్యప్ప క ల్యాణ మండపం వరకు ప్రధాన వీధుల గుండా జ గన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్టు ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) కామారెడ్డి ప్రతినిధి వెంకటదాస్ ప్రభు తెలిపారు.రథయాత్రలో భాగంగా భజన కీర్తక, ప్రవచనాలు, చప్పన్ భోగ్, మహా హారతి, అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.
జన జాగరణ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ
లింగంపేట(ఎల్లారెడ్డి): ఉద్యోగులు ఓపీఎస్ సాధించేవరకు పోరాడాలని టీఎస్‌సీపీఎస్‌యూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి అన్నారు.కుంట ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సెంటర్ ఇన్‌చార్జి కోటేశ్వర్‌రావు చేతుల మీదుగా లింగంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం ఉపాధ్యాయులు జనజాగరణ యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 22న జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, సునిల్‌కుమార్, రజినీకాంత్,సుధాకర్‌గౌడ్,రాము,దామోదర్, సంతోష్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
ప్రభుత్వ ఈఎన్‌టీ వైద్యుడికి సన్మానం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) నిపుణులు వైద్యుడు బండారి భరద్వాజ్‌ను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు సోమవారం ఆస్పత్రిలో ఘనంగా సన్మానించారు. ముక్కు సమస్యతో శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఓ రోగికి సరికొత్త విధానంలో శస్త్రచికిత్స చేసి, ఒక్క రోజులోనే కోలుకునేలా వైద్యం అందించినందుకు గాను ఆయనను శాలువాతో సత్కరించారు. జిల్లా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యుడిని కమిటీ ప్రతినిధులు అభినందించారు. కమిటీ రాష్ట్ర డైరెక్టర్ సలీం, జిల్లా ప్రతినిధి రామచందర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఎం. సుధాకర్, రాజన్న ఉన్నారు.


