ఏటీసీని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏటీసీని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Jul 21 2026 1:24 AM | Updated on Jul 21 2026 1:24 AM

ఏటీసీని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి మొక్కలు ధ్వంసం చేసిన వారిపై ఫిర్యాదు రోడ్డు పనుల పరిశీలన

కామారెడ్డి టౌన్‌ : నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ని భిక్కనూరు మండలం గుర్జాకుంటలో కాకుండా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్‌కార్‌ వినయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌ విక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వినయ్‌ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించే ఈ కేంద్రాన్ని గుర్జాకుంటలో ఏర్పాటు చేస్తే ఇతర మండలాల విద్యార్థులకు రాకపోకల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. జిల్లా కేంద్రం అన్ని మండలాల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. నాయకులు చందు, నోమన్‌, ప్రణయ్‌, పాషా తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులో ఇటీవల నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వారిపై సోమవారం లింగంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్‌ బాబాయి లావణ్య తెలిపారు. ఇటీవల పర్మళ్ల శివారులోని అటవీ ప్రాంతంలో హరిత వనాలలో భాగంగా ఉపాధి హామి కూలీలు, అధికారులు కలిసి 1000 మొక్కలు నాటారు. అందులో గుర్తు తెలియని వ్యక్తులు 350 వరకు ధ్వంసం చేసినట్లు తెలిపారు. మొక్కలను పరిశీలించడానికి వెళ్లిన జీపీ కార్యదర్శి, క్షేత్రసహయకులను దూషించిన తండావాసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు సోమవారం ధ్వంసం చేసిన మొక్కలను ఉపాధి హామీ ఏపీవో నరేందర్‌ పరిశీలించారు.

మొరం అక్రమ తవ్వకాలపై ..

భిక్కనూరు: మండలకేంద్రంలోని గోర్మిట్‌కుంటలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆర్‌టీఐ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగల రవీందర్‌ సోమవారం భిక్కనూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న గోర్మిట్‌కుంటలో మొరం తవ్వుతున్నారని ఫిర్యాదు చేస్తే అక్కడికి వెళ్లిన రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్న జేసీబీని స్వాధీనం చేసుకోకుండా వదిలివేశారని దీనిపై విచారణ జరిపాలని కోరారు.

బిచ్కుంద(జుక్కల్‌): పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులను సోమవారం ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు పరిశీలించారు. మధ్యలో నిర్మిస్తున్న డివైడర్‌లో విద్యుత్‌ స్తంభాలు, పచ్చని చెట్లు పెట్టి అందంగా ఉండే విధంగా చూడాలని అధికారులను సూచించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు చేసేటప్పుడు తాగునీటి పైపులు పగిలిపోకుండా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. విఠల్‌రెడ్డి, నాగ్‌నాథ్‌, భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement