ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

Jul 21 2026 1:24 AM | Updated on Jul 21 2026 1:24 AM

లింగంపేట: మండల కేంద్ర శివారులోని 983 సర్వే నంబర్‌లో గల అసైన్డ్‌ భూములను అటవీ భూములుగా చూపిస్తున్నారని బాధిత రైతులు ఆరోపించారు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములుగా చూపిస్తుండడంతో తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించడం లేదన్నారు. ఈ భూముల్లో పండిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్నామని, అసైన్డ్‌ భూములుగా ఆన్‌లైన్‌లో మార్చి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, రైతులు పోచయ్య, సత్తవ్వ, భూమయ్య, గంగయ్య, సాయిరాం, రాములు, పోచయ్య, బలరాం, భీమయ్య, నాగయ్య, సాయిలు, విఠల్‌, బాలయ్య, గురుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement