పిట్లం(జుక్కల్): యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ విఠల్‌రెడ్డి అన్నారు.ఆయన సోమవారం మండలంలోని చిల్లర్గి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులకు సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ప్రాధాన్యత, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసులతో సమన్వయంగా పనిచేస్తూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై అంజనేయులు, సిబ్బంది మురళి, ప్రియంకా తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో వివిధ బ్యాంకుల్లో
అవగాహన కల్పించిన ిసీఐ
బాన్సువాడ : బ్యాంకుల వద్ద అమాయక ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ సీఐ శ్రీధర్ అన్నారు. సోమవారం పట్టణంలోని వివిధ బ్యాంకుల్లో అవగాహన కల్పించారు. బ్యాంకులకు వచ్చే ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంకు పరిసరాలను పరిశీలించారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను అవసరమైన మేరకు పరిశీలించి, వారి రాకపోకలపై ఆరా తీశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల వద్ద అమాయక ప్రజలను మాటల్లో పెట్టి మోసాలకు పాల్పడే వారిపై అప్రమత్తతతో ఉండాలని అన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.


