కామారెడ్డి క్రైం : తాళం వేసి ఉన్న విద్యుత్‌శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలోని కాకతీయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న గంగాధర్ సదాశివనగర్ ట్రాన్స్‌కో ఏఈగా పని చేస్తున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి గంభీరావుపేటకు వెళ్లారు. దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. సోమవారం వచ్చిన గంగాధర్ కుటుంబం ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్‌టీం బృందం ఆ ధారాలు సేకరించింది. బీరువాలో దాచి ఉంచిన 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఆలయంలో ..
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రం చౌడెకర్ కాలనీలో ఉన్న దుర్గామాత ఆలయంలో ఆదివారం రా త్రి దొంగలు హల్‌చల్ చేశారు. కాలనీవాసులు తె లిపిన వివరాలు.. అర్ధరాత్రి దుండగులు ఆలయ గే ట్ తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి చొరబడ్డారు. సోమవారం ఆలయానికి వచ్చిన అర్చకులు గ మనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. అమ్మ వారి విగ్రహంపై ఉన్న రోల్డ్‌గోల్డ్ వస్తువులు చోరీకి గురైనట్లు తెలిపారు. దొంగల భయంతో అమ్మ వారి బంగారు, వెండి వస్తువులను తీసి రోల్డ్‌గోల్డ్ నగలను పెట్టినట్లు భక్తుడు క్రిష్ణాగౌడ్ తెలిపారు.
● 3 తులాల బంగారం,
20 తులాల వెండి అపహరణ


