సాగుకు ప్రతిపాదించిన పంటలకు అవసరమైన విత్తనాలు(క్వింటాళ్లలో)
● నీటి వాడకాన్ని తగ్గించాల్సిందే
● ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించాలి
● రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు
మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వేదికపై జిల్లా ప్రత్యేకాధికారి యోగితారాణా, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, ధన్‌పాల్, రాకేష్‌రెడ్డి, కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, ఎస్పీ రాజేశ్ చంద్ర
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ.. ఫలితంగా సాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యతనివ్వాలని రైతులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఎక్కువ నీరు అవసరం అయ్యే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సూచించనుంది. ఇప్పటికే అంకెలు, లెక్కలను సిద్ధం చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 248.5 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 172.60 మి.మీ. వర్షమే కురిసింది. దాదాపు 31 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో 25 మండలాలుండగా 19 చోట్ల లోటు, ఒక మండలంలో మరింత లోటు, నాలుగు మండలాల్లో సాధారణం, ఒక మండలంలో సాధారణంకన్నా ఎక్కువ వర్షపాతం రికార్డయ్యింది. ఈనెలతోపాటు వచ్చే రెండు నెలల్లోనూ సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో జూన్‌లో భూగర్భ జలమట్టం 12.97 మీటర్ల లోతులో ఉండగా, జూలైలో 13.43 మీటర్లకు పడిపోయాయి. ఆగస్టులో 13.86 మీటర్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది.
తగ్గనున్న సాగు విస్తీర్ణం..
జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.39 లక్షల ఎకరాలు కాగా.. 2023 సంవత్సరంలో 5.20 లక్షల ఎకరాల్లో, 2024లో 5.53 లక్షల ఎకరాలలో, 2025 సంవత్సరంలో 5.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి ఇప్పటివరకు 2.58 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గనుందని విశ్లేషిస్తున్నారు.
ఏ నేలలో ఏ పంట వేయాలంటే..
నీటి సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జూలై 16 నుంచి 31 వరకు తేలికపాటి నేలల్లో పత్తి, కందులు వేయాలని చెబుతున్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు కందులు సాగు చేయవచ్చంటున్నారు. మధ్యస్థం నుంచి బరువైన నేలల్లో జూలైలో పత్తి, కందులు, కూరగాయలు, ఆగస్టు 1 నుంచి 15 వరకు కందులు, కూరగాయలు సాగు చేయాలని సూచిస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్‌ల వినియోగం ద్వారా తక్కువ నీటిని ఎక్కువ విస్తీర్ణానికి అందించవచ్చని పేర్కొంటున్నారు. భూగర్భజలాల వృద్ధి కోసం ఇంకుడు గుంతలు, ఫాంపాండ్‌లు తవ్వుకోవాలని సూచిస్తున్నారు.
పంట ఎకరాలు అవసరమైన అందుబాటులో
విత్తనం ఉన్నవి
కంది 2,691 108 219
పెసర 299 24 25
మినుము 311 25 26
బబ్బెర్లు 342 41 14
వరి 1,47,280 36,820 ––
మక్క 4,529 362 653
మేతజొన్న 184 18 17
మొత్తం 1,55,636 37,398 954
జిల్లాలో అతిలోటు వర్షపాతం
నమోదైన గ్రామాలు : 14
లోటు వర్షపాతం నమోదైన గ్రామాలు : 428
సాధారణ వర్షపాతం నమోదైన గ్రామాలు : 32
వర్షాధార పంటలు : 1,83,312 ఎకరాలు
నీటి సౌకర్యంతో వేసిన పంటలు :
1,68,834 ఎకరాలు
మొత్తం : 3,52,146 ఎకరాలు
సాగు చేయని భూమి : 2,03,534 ఎకరాలు


