ఖరీఫ్‌కు సన్నద్ధం! | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు సన్నద్ధం!

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

ఖరీఫ్‌కు సన్నద్ధం! సూచనలు పాటించాలి.. ప్రధాన పంట వరే..

ఎరువులు..

ఖరీఫ్‌ సాగుకు సంబంధించిన అంచనాల వివరాలు (ఎకరాలలో)..

జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద బాన్సువాడ డివిజన్‌ పరిధిలో సుమారు 31 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాంతంలో ముందస్తు వరినాట్లు పడతాయి. దీంతో పాటు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం, నిజాంసాగర్‌ మండలంలోని సింగితం, జుక్కల్‌లోని కౌలాన్‌నాలా, ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్టుల ఆయకట్టు విస్తీర్ణం కూడా గణనీయంగానే ఉంటుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా చెరువులు, వ్యవసాయ బోరుబావుల కింద వరి సాగు చేస్తారు. వర్షాధారంగా ఆరుతడి పంటలు వేస్తారు. ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు.. విత్తనాలు, ఎరువులను కొనేందుకుగాను ఫర్టిలైజర్‌ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశాలు ఉండడంతో ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని భావిస్తున్నారు.

విత్తనాలు..

81,200 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 28,140 క్వింటాళ్ల సోయాబీన్‌, 4,480 క్వింటాళ్ల మక్క, 389.25 క్వింటాళ్ల పత్తి, 1,780 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని అంచనా వేసిన వ్యవసాయ అధికారులు.. కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 5.59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తాం. రైతులు పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. మంచి దిగుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

– మోహన్‌రెడ్డి, డీఏవో, కామారెడ్డి

రీఫ్‌ సమీపిస్తున్న వేళ జిల్లా వ్యయసాయ శాఖ సాగులోకి వచ్చే పంటలు, అవసరమైన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేసింది. జిల్లాలో సాగుకు అనుకూలంగా 5.78 లక్షల ఎకరాల భూములు ఉండగా.. 5.59 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఈసారీ అత్యధిక విస్తీర్ణంలో వరి పంట సాగవనుంది. సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయనున్నారు. వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సోయాబీన్‌ సాగవనుంది. మక్క, పత్తి, కంది పంటలు కూడా గణనీయమైన విస్తీర్ణంలో సాగవుతాయని భావిస్తున్నారు.

మొత్తం 1,02.325 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేశారు. 50,079 మెట్రిక్‌ టన్నుల యూరియా, 29,316 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 11,317 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 6,648 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ ఎరువులు అవసరం. సకాలంలో ఎరువులు తెప్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

పంట సాగు అంచనా

వరి 3,20,000

సోయా 90,684

మక్క 54,500

పత్తి 42,887

కంది 45,500

పెసర 3,382

మినుము 2,858

ఇతర పంటలు 500

వానాకాలం సీజన్‌ సమీపిస్తోంది. వ్యవసాయ అధికారులు ఖరీఫ్‌ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సీజన్‌లో 5.59 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు.. అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో

ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

– కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డిరూరల్‌

అంచనాలు సిద్ధం చేసిన

వ్యవసాయ శాఖ

5.59 లక్షల ఎకరాల్లో

పంటలు సాగయ్యే అవకాశం

50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా,

1,16 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

అవసరం

Advertisement
 
Advertisement
Advertisement