‘అంతిమ’ కష్టాలు తొలగాలి | - | Sakshi
Sakshi News home page

‘అంతిమ’ కష్టాలు తొలగాలి

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

‘అంతిమ’ కష్టాలు తొలగాలి

రాజకీయాలకు అతీతంగా స్పందించాలి

సాక్షి ప్రతినిఽధి, కామారెడ్డి : దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. తాజాగా కామారెడ్డి పట్టణ సదర్‌ సంఘం ప్రతినిధులు సమావేశమై వైకుంఠధామంలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశమైన ఆయా కుల సంఘాల ప్రతినిధులు.. వైకుంఠధామం దుస్థితిని వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’ని అభినందించారు. సొంత డబ్బులతో శ్మశాన వాటిక రూపురేఖలు మారుస్తానని ప్రకటించిన సుభాష్‌రెడ్డి దాతృత్వాన్ని కొనియాడిన సదర్‌సంఘం ప్రతినిధులు.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీ భక్త హనుమాన్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుభాష్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటికే సుభాష్‌రెడ్డిని బీజేపీ కౌన్సిలర్లు అభినందించడంతో పాటు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల కష్టాలను తీర్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చే విషయంలో తాను అండగా ఉంటానని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, నేతలు హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని కలిసి శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. బల్దియాలో ఉన్న టుఫిడ్‌కో నిధులతో అభివృద్ధి చేయడం కోసం డీపీఆర్‌ సిద్ధం చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఉమారాణి పేర్కొన్నారు. ఇలా అందరూ స్పందిస్తుండడంతో జిల్లాకేంద్రంలోని అన్ని వర్గాల ప్రజలు శ్మశాన వాటిక సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

కామారెడ్డి టౌన్‌ : పట్టణంలోని వైకుంఠధామాల అభివృద్ధికి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేయి కలపాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శ్మశాన వాటికల అభివృద్ధిపై సదర్‌ సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో శిథిలావస్థకు చేరిన వైకుంఠధామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు చేపట్టే విషయమై సదర్‌ సంఘం సభ్యులు చర్చించారు. సుభాష్‌రెడ్డికి సహకరించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఆయా కుల సంఘాల అధ్యక్షులు, ప్రముఖులు చింతల రమేష్‌, అశోక్‌ యాదవ్‌, రాజుగౌడ్‌, మోహన్‌రెడ్డి, భూమే ష్‌, కురుప మహేందర్‌, శ్రీకొండ నారాయణ, బెజ్జని సుదర్శన్‌, మనకంటి శ్రీనివాస్‌, నర్సల్లా మహేష్‌, సాయికుమార్‌, గుమ్మలవారి రవి, కూటాడి అంజయ్య, ప్రభాకర్‌, సంజీవ్‌, అర్జున్‌రావు, సుదర్శన్‌, రాజు, నరేష్‌, సంతోష్‌, పుల్లూరి సతీష్‌, రామ్‌రెడ్డి, మల్లేష్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు.

అందరిదీ అదే మాట

సుభాష్‌రెడ్డికి మద్దతు

ప్రకటించిన కామారెడ్డి సదర్‌ సంఘం

పాలాభిషేకం చేసిన అశోక్‌నగర్‌

ఆర్యవైశ్య సంఘం నేతలు

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి

అభినందనల వెల్లువ

Advertisement
 
Advertisement
Advertisement