ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

ప్రశాంతంగా నీట్‌

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌ అర్బన్‌): నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌(నేషనల్‌ ఎల్జిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలతోపాటు నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కళాశాల యూజీ బ్లాక్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ బ్లాక్‌, కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీ, బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాక్లూర్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వెంట అడ్మిట్‌ కార్డు, ఐడీ ప్రూఫ్‌, లేటెస్ట్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో తమ వెంట తెచ్చుకుంటేనే లోనికి అనుమతించారు. అనంతరం బయోమెట్రిక్‌ నమోదు చేశారు. దీంతో వెంట ఫొటోలు తీసుకురాని వారు సమీపంలోని స్టూడియోలకు వెళ్లి ఫొటోలు తీసుకువచ్చారు. 3,334 మందికిగాను 3,227 మంది హాజరయ్యారు. గిరిరాజ్‌ కళాశాల సెంటర్‌ను సీపీ సాయిచైతన్య, మాక్లూర్‌లోని సెంటర్‌ను అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement