జిల్లా సరిహద్దులో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

జిల్లా సరిహద్దులో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

జిల్లా సరిహద్దులో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు

నాగిరెడ్డిపేట: జిల్లా సరిహద్దులోని పోచారం వద్ద ఆదివారం స్థానిక పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లోని ఒక జ్యువెలరీ షాపులో ఆదివారం ఐదుగురు దుండగులు పిస్టల్‌తో కాల్పులు జరిపి దొంగతనం చేసి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సరిహద్దులో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement