సుభాష్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

సుభాష్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

సుభాష్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలో శ్మశానవాటికల అభివృద్ధికి ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డికి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలోగల భక్త హనుమాన్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ సుభాష్‌రెడ్డి చేస్తున్న నిస్వార్థ సేవలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. వైకుంఠధామాల అభివృద్ధి వంటి పవిత్రమైన కార్యక్రమాల్లో ఆయన చొరవ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నీల ప్రభాకర్‌, కార్యదర్శి శ్రీధర్‌, కోశాధికారి రమేశ్‌, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement