కామారెడ్డి టౌన్ : విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందిస్తూ, వారి వ్యక్తిత్వ నిర్మాణమే ధ్యేయంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తోందని ఆ సంఘం తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పాలిసెట్ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ నిలిచిందన్నారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా, పాలిసెట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తూ విద్యార్థులకు అండగా ఉంటున్నామన్నారు. కార్యక్రమంలో పరిషత్ విభాగ్ సంఘటన కార్యదర్శి హర్షవర్ధన్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అనిల్‌రెడ్డి, జిల్లా ప్రతినిధులు గిరి, స్వామిరెడ్డి, పవన్, అల్తాఫ్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.


