ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

పిట్లం(జుక్కల్‌): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన జుక్కల్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు జుక్కల్‌ నియోజకవర్గంలో సుమారు 35 వేల మందికి కొత్త రేషన్‌ కార్డులను అందించామన్నారు. అలాగే సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌వోసీ ద్వారా రూ.35 కోట్ల వరకు ఆర్థిక సహాయం చేశామన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement