నిబంధనల మేరకు ధాన్యాన్ని ఆరబెట్టాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు ధాన్యాన్ని ఆరబెట్టాలి

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు ఆరబెట్టాలని ఏవో రాజలింగం సూచించారు. శనివారం ఆయన మండల పరిధిలోని పేట్‌సంగెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆరబెట్టిన ధాన్యంతో పాటు తూకం వేసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. స్థానిక రైతు వేదిక భవనంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మొక్కజొన్నలు, జొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement