● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
● బాన్సువాడలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ సమావేశం
బాన్సువాడ: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్‌ఎంబీ ఫంక్షన్ హాల్లో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడమే ప్రజాపాలన లక్ష్యమని అన్నారు. ప్రజలను మోసం చేసి అక్రమ అస్తులు, డబ్బులు సంపాదించుకున్న నాయకుడు అసలు నాయకుడే కాదని, సేవ చేసే ఓపిక లేకుంటే రాజకీయాల్లోకి రావద్దని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, డీఆర్‌డీవో సాయన్న, బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ శ్యామల, స్థానిక నాయకులు, తదితరులు ఉన్నారు.


