అప్పులకు వడ్డీలు కట్టడమే గగనమవుతోంది | - | Sakshi
Sakshi News home page

అప్పులకు వడ్డీలు కట్టడమే గగనమవుతోంది

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

భిక్కనూరు: బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ అప్పుల తెలంగాణాగా మార్చివేశారని, ఆయన హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం ప్రజాప్రభుత్వానికి గగనమవుతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం ఆయన భిక్కనూరులో గొల్ల మల్లమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 4.28 లక్షలు ఇస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.72 వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ రూ.72 వేల కోసం 22 నిబంధనలు పెట్టి ఇవ్వడం లేదని విమర్శించారు. భిక్కనూరులో 30 పడకల ప్రభుత్వాస్పత్రిని నిర్మించేందుకు కృషిచేస్తున్నానని త్వరలో ప్రభుత్వం ఈ విషయమై ప్రకటన జారీ చేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామన్నారు. నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, బల్యాల రేఖ, దుంపల మోహన్‌రెడ్డి, భీంరెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

తాతకు తగ్గ మనవరాలు షర్మిష్ట

భిక్కనూరు: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించిన షర్మిష్ట.. తాతకు తగ్గ మన వరాలు అనిపించుకోవడం సంతోషమని షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం ఆయన షర్మిష్టను భిక్కనూరులో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిష్ట తాత నాగభూషణం ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement