రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

ఎల్లారెడ్డిరూరల్‌: ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆర్డీవో ప్రభాకర్‌ సూచించారు. శనివారం ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఽ ధాన్యం కాంటా వేగవంతం చేయాలని, కాంటా చేసిన బస్తాలను ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించాలని అన్నారు. తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, ఏపీఎం రాంనారాయణ్‌గౌడ్‌ తదితరులున్నారు.

ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌ సూచించారు. జప్తిజాన్కంపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలుకేంద్రంలో సేకరించిన ధాన్యం వివరాలను స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా కొనుగోలు కేంద్రంలో జరిగిన ధాన్యం సేకరణపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలుకేంద్రంలో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయని, లారీలను వెంటనే పంపాలని సూచించారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్‌ భిక్షపతి, ఆర్‌ఐ మహేష్‌చంద్ర, సొసైటీ సీఈవో మరళీచంద్ర, జీపీవో లక్ష్మణ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement