కామారెడ్డి అర్బన్: శూర్ వీర్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని, ఆయన జ్ఞాన మందిరానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దశలవారి ఉద్యమంలో భాగంగా ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట నిరసన, ధర్నా నిర్వహించనున్నట్టు నంగరా భేరి లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ,రాష్ట్ర కమిటీ నాయకులు అన్నారు. శనివారం కామారెడ్డిలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 30న సడక్ బంద్, జూన్ 15న కొండారెడ్డిపల్లి ఎక్స్ రోడ్ నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వరకు పాదయాత్ర చేయనున్నట్టు పోరాట సమితి నాయకులు వెల్లడించారు. నాయకులు గణేష్‌నాయక్, వెంకట్‌గౌడ్, మోతీలాల్‌నాయక్, సిద్ధిరాములు, ఆజాద్, తదితరులు పాల్గొన్నారు.


