జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
● పూర్తయిన ఇళ్లలో
గృహప్రవేశాలు నిర్వహించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పనులు పూర్తయిన చోట గృహప్రవేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. మంజూరైన అన్ని గృహాలకు వెంటనే మార్కవుట్ ఇవ్వాలన్నారు. మార్కవుట్ పూర్తయినవాటిలో బేస్‌మెంట్ పనులు వేగంగా పూర్తి చేయించాలన్నారు. ఎంపీడీవోలు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పనులను పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక హాస్టల్‌ను గుర్తించి వెంటనే మరమ్మతుల పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, హౌసింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత
కామారెడ్డి క్రైం: ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రా ధాన్యతనిస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నా రు. మేడేను కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స మాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్మికులు తమ విధులను సమర్థవంతంగా ని ర్వర్తిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కో రారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపికై న కార్మిక దినోత్సవ అవార్డులను కలెక్టర్ అందజేశారు. ఉత్తమ పరిశ్రమగా బేసిస్ లాబొరేటరీస్, ఉ త్తమ ఉద్యోగులుగా సయీద్ కమ్రుద్దీన్ (కార్మిక శా ఖ), కృప (ఉపాధి కల్పన శాఖ), రమేశ్ (ఏటీసీ, తాడ్వాయి) లకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్మిక సంఘాల నాయకులను సన్మానించారు. కార్య క్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, గ్రంథాల య సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్, అదనపు కలెక్టర్ మధుమోహన్, సహాయక కా ర్మిక కమిషనర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ యువతకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా యువజన, క్రీడలు, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఈనెల 7న నిజామాబాద్‌లోని శ్రీరామ గార్డెన్‌లో జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు. 50 కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆసక్తిగలవారు రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల అధికారి జిల్లా కార్యాలయంలో గానీ, 94408 46682, 96181 26053 నంబర్లలోగానీ సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


