విద్యుత్ బిల్లుల భారం కొండలా పేరుకుపోతున్నా బల్దియా సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. పట్టపగలు వీధి దీపాలు వెలుగుతున్నా ఆర్పడం లేదు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో శుక్రవారం రోజంతా డివైడర్ల మధ్యనున్న వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. కామారెడ్డి బల్దియా ఇప్పటికే విద్యుత్ శాఖకు రూ. 13 కోట్లకుపైగా విద్యుత్ బిల్లులు బకాయి పడింది. పగటిపూట కూడా వీధి దీపాలను ఆర్పకుండా విద్యుత్‌ను వృథా చేస్తుండడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– కామారెడ్డి టౌన్


