కామారెడ్డి టౌన్ : బల్దియా పరిధిలోని శ్మశాన వాటికల అభివృద్ధి కోసం టుఫిడ్కో ద్వారా రూ. 1.30 కోట్ల నిధులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. శుక్రవారం ఆమె తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, ఇందిరానగర్ కాలనీల్లో ఉన్న శ్మశాన వాటికలను సందర్శించామని, ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయంపై తమకు పూర్తి సమాచారం లేదన్నారు. ఎవరైనా సేవా దృక్పథంతో ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు అంజాద్, జావెద్, కాంగ్రెస్ నాయకులు కాళ్ల గణేశ్, భాస్కర్ గౌడ్, సత్యం, సిద్దిక్, చిట్టిబాబు, లడ్డు, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.


