భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో మెదక్ జిల్లా బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన తొత్తల సుశీల(85) కాచాపూర్ గ్రామంలో ఉంటున్న సోదరి పద్మ ఇంటికి నెల రోజుల క్రితం వచ్చింది. ఏప్రిల్ 29న పద్మ తన అక్క సుశీలను కాచాపూర్ వద్ద కామారెడ్డి వెళ్లే బస్సు ఎక్కించింది. అప్పటి నుంచి సుశీల ఆచూకీ లేదు. సుశీల కొడుకు తొత్తల మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఎల్లారెడ్డిలో యువతి...
ఎల్లారెడ్డి: పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతానికి చెందిన కల్లెం పరిమళ (19) గత శనివారం నుంచి కనిపించడం లేదని ఎస్సై మహేశ్ కుమార్ తెలిపారు. ఎర్రమన్ను కుచ్చ ప్రాంతానికి చెందిన కల్లెం పాలవ్వ, ఎల్లయ్య దంపతులు డబుల్ బెడ్‌రూం కాలనీలో ఉంటున్నారు. శనివారం కూతురు పరిమళతో కలిసి లహరి కృష్ణ దేవాలయానికి వెళ్లారు. బయటికి వెళ్లొస్తానని చెప్పిన కుమార్తె తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యువతి అదృశ్యం
మోపాల్: మండలంలోని సిర్‌పూర్ ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన అహల్య అనే యువతి అదృశమెనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. సుఖదేవ్ తన కుటుంబసభ్యులతో నాలుగు నెలల క్రితం ఒడిశా నుంచి సిర్‌పూర్‌లోని ఇటుక బట్టీకి వచ్చారు. గురువారం సాయంత్రం నుంచి అహల్య కనిపించడం లేదు. బంధువుల వద్ద వివరాల కోసం ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఆమె తండ్రి సుఖదేవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.


