ఘనంగా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ధర్మారెడ్డిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ 37వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి మంగళవారం బోనాలను సమర్పించారు. భక్తులు డప్పు చప్పుళ్ల మధ్య బోనాలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీంతోపాటు అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
బారడి పోచమ్మకు బోనాలు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలోని బారడి పోచమ్మకు మంగళవారం ఘనంగా బోనాల తీశారు. ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. మొక్కులు చెల్లించారు. పిల్లా పాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు.
ఘనంగా ధ్వజారోహణం
మాచారెడ్డి: చుక్కాపూర్‌లోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు సేవాకాలం ప్రాభోదకి యాగశాల ప్రవేశం, శాంతిపాఠం కార్యక్రమాలను కనుల పండువగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి,తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఈవో ప్రభు రామచంద్రం, డైరెక్టర్లు రాజిరెడ్డి, లక్ష్మీరాజం, శంకర్ గౌడ్, అర్చకులు ఉన్నారు.
కాలభైరవుడికి 108 రకాల స్వీట్లతో నైవేద్యం
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షే త్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీకాలభైరవుడిని వైశాఖ మా సం రెండో మంగళవారం సందర్భంగా 108 రకాల స్వీ ట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు ఉద యం నుంచి స్వామి వారికి జలాభిషేకాలు, సింధూ ర పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారి కి అర్చకులు 108 రకాల స్వీట్లతో అలంకరించి నైవే ద్యం సమర్పించారు. స్వామికి అలంకరించే కరెన్సీ దండకు భక్తులు విరాళౠలు అందజేశారు. అనంతరం అన్నదారం నిర్వహించారు. మూడో మంగళవారం 108 రకాల కూరగాయలతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చింతల శంకర్, ఈవో ప్రభుగుప్తా, అర్చకులు శ్రీనివాసశశర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్ పాల్గొన్నారు.


