లబ్ధిదారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారుల ఎంపిక

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

లబ్ధిదారుల ఎంపిక ప్రతినెలా వందకుపైగా సెల్‌ఫోన్‌ల రికవరీ బాన్సువాడ ఎంసీహెచ్‌కు పురస్కారం పరిశుభ్రత పాటించాలి

కామారెడ్డి క్రైం: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం కలెక్టరేట్‌లో లక్కీడ్రా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ ఆధ్వర్యంలో ప్రక్రియ సాగింది. వివిధ కేటగిరీలలో సబ్సిడీపై అందజేసేందుకుగాను జిల్లాకు 13 వాహనాలు మంజూరయ్యాయని అదనపు కలెక్టర్‌ తెలిపారు. వాటిలో 8 జనరల్‌, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 2 మహిళలకు కేటాయించారన్నారు. అన్నింటికీ కలిపి 113 దరఖాస్తులు వచ్చాయన్నారు. జనరల్‌ కేటగిరీ కింద 8 వాహనాలకుగాను వచ్చిన 109 దరఖాస్తుల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించామని తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 2 చొప్పున కేటాయించామన్నారు.

కామారెడ్డి క్రైం: ప్రతినెలా పోగొట్టుకున్న వంద కుపైగా సెల్‌ఫోన్‌లను రికవరీ చేస్తున్నామని ఎ స్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే ఆందోళనకు గురికావొద్దని, సీ ఈఐఆర్‌ విధానంలో రికవరీకి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో నెల రోజుల్లో బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 384 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామన్నారు. వాటి వి లువ దాదాపు రూ. 61 లక్షలు ఉంటుందన్నా రు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా మ్తొతం రూ. 7.46 కోట్ల విలువైన 4,665 సెల్‌ఫోన్‌లను రిక వరీ చేశామని పేర్కొన్నారు. రికవరీ చేసిన ఫోన్‌ ల వివరాలను బాధితులకు తెలియజేస్తామని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్సై బాల్‌రాజు (87126 86114) ను సంప్రదించి ఫోన్‌లు తీసుకువెళ్లాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆరోగ్య శాఖ సిబ్బందిని, ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలకు ఎంపిక చేసింది. అత్యధిక కాన్పులు చేయడం, నాణ్యమైన వైద్య సేవలు అందించినందుకు గాను బాన్సువాడ ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి ఉత్తమ ఆస్పత్రి అవార్డు దక్కింది. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహా, మెడికల్‌ హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ క్రిస్టీనా జెడ్‌ చోంగ్తూ చేతుల మీదుగా డీసీహెచ్‌ఎస్‌ విజయభాస్కర్‌రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.

ఉత్తమ వైద్యుడిగా శ్రీనివాస్‌ప్రసాద్‌

బాన్సువాడ: ఉత్తమ వైద్యుడిగా బాన్సువాడకు చెందిన శ్రీనివాస్‌ప్రసాద్‌ మంగళవారం అవార్డు అందుకున్నారు. ఆయన గతంలో బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

లింగంపేట: ఆస్పత్రిలోని వార్డులు, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని డీఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్‌ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట పీహెచ్‌సీని తనిఖీ చేశా రు. రోజూ ఓపీ పేషెంట్లు ఎంతమంది వస్తు న్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. వంద శాతం స్క్రీనింగ్‌ పూర్తి చేసి బీపీ, షుగర్‌ పేషెంట్స్‌కు వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హిమబిందు, సీహెచ్‌వో ఠాగూర్‌, సబ్‌యూనిట్‌ అధికారి గోవింద్‌రెడ్డి, సూపర్‌వైజర్లు ఫరీద, చంద్రకళ, యాదగిరి, ప్రదీప్‌, సుభాష్‌, గీత, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement