తాగునీటి సమస్యలపై ప్రత్యేక సెల్‌ | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యలపై ప్రత్యేక సెల్‌

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

కామారెడ్డి క్రైం: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డ్రింకింగ్‌ వాటర్‌ మానిటరింగ్‌ సెల్‌ను కామారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏ గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తినా టోల్‌ ఫ్రీ నంబర్‌ 99087 12421 ను సంప్రదించాలని సూచించారు. ఈ సెల్‌ జూన్‌ 30 వ తేదీవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి లాలు, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి వెంకటశ్వర్లు, డీఎల్పీవో శ్రీనివాస్‌, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గృహ జాబితా బ్లాక్‌లను సమగ్రంగా

రూపొందించాలి

కామారెడ్డి క్రైం: జనగణన ప్రక్రియలో భాగంగా గృహ జాబితా బ్లాక్‌లను సమగ్రంగా రూపొందించాలని కలెక్టర్‌ సంగ్వాన్‌ సాంకేతిక సహాయకులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఎన్యుమరేటర్‌కు సమానంగా బ్లాక్‌ల తయారీ పనులు అప్పగించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా గృహ బ్లాక్‌ల జాబితా సిద్ధం చేయాలన్నారు. జనగణన ప్రక్రియ కోసం ఇది ఎంతో ముఖ్యమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement